EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

డాక్టరేట్  అందుకున్న పల్లెబిడ్డ షేక్ హుస్సేన్

పెన్ పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 83వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టా పొందారు. తెలుగులో ముస్లింసాహిత్యం, ముస్లింవాద సాహిత్యం – సమగ్ర అధ్యయనం అనే అంశంపై ప్రొ. ఎన్.ఆర్. వెంకటేశం పర్యవేక్షణలో సమర్పించిన సిద్ధాంతగ్రంథానికి గాను ఈ డాక్టరేట్ లభించింది. ఈ పట్టాను షేక్ హుస్సేన్ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ప్రొ. దండెబోయిన రవీందర్, అడోబ్ కంపెనీ సిఈఓ డా. శంతను నారాయణన్ ల చేతుల మీదుగా అందుకున్నారు.

పెన్ పహాడ్ మండలంలో తొలిసారిగా తెలుగులో డాక్టరేట్ సాధించిన వ్యక్తిగా షేక్ హుస్సేన్ నిలిచారు. ఇదే మండలం నుంచి డాక్టరేట్ అందుకున్న తొలి ముస్లింగా కూడా నిలిచారు. చిన్నకారు రైతుకుటుంబంలో జన్మించిన హుస్సేన్ తల్లిదండ్రులు షేక్ జాన్ సాబ్ -(స్వర్గియ) అసాన్ బీల ప్రోత్సాహంతో వ్యవసాయం నుంచి విద్యకు మళ్లారు.

 ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన షేక్ హుస్సేన్ సాహిత్యం పట్ల తనకు ఉన్న ఆసక్తితో స్వశక్తితో ఎం.ఎం., ఎల్ఎల్.బి చేసి హైకోర్ట్ న్యాయవాదిగా ఎదిగారు. అదే క్రమంలో తెలుగులో పరిశోధనకు ఉపక్రమించి, ఎంతో పరిశ్రమలో చక్కనైన సిద్ధాంతగ్రంథాన్ని రూపొందించి విశ్వవిద్యాలయానికి సమర్పించారు. విద్యార్థి జెఎసి నాయకునిగా తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎంతోమంది యువకులకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ వారి విద్యాప్రగతికి తోడ్పడుతున్నారు.

డాక్టరేట్ సాధించిన షేక్ హుస్సేన్ ను అభినందిస్తూ హుస్సేన్ కృషి ఎందరికో స్ఫూర్తినిస్తుందని అనంతారం గ్రామస్థులు అభినందించారు.

 

Related News

Select the Topic
Scroll to Top