ఈతరం భారతం/సంగారెడ్డి/నవంబర్ 1:
దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ …ఆనాడు ఇందిరా గాంధీ ప్రపంచ దేశాలను శాసిస్తే ..ఈనాడు ప్రపంచ దేశాలు ప్రధాన మంత్రి మోడీని శాసిస్తున్నాయన్నారు. తెలంగాణ లో 14 ఎంపి లను, ఆంధ్ర ప్రదేశ్ లో 20 ఎంపిలను గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తెలంగాణ అభివృద్ధి కావడం తో పాటు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం ,పోలవరం పూర్తి అవుతుందన్నారు….తెలంగాణ, ఏపి ప్రజలు ఇప్పటినుండే ఆలోచన చేయాలని జగ్గ రెడ్డి విజ్ఞప్తి చేసారు. తెలంగాణ లో పదేళ్లు కేసీఆర్, ఏపి లో పదేళ్లు జగన్, చంద్ర బాబులు ముఖ్యమంత్రులుగా ఉండి కేంద్రం లో బీజేపీ కి మద్దతు ఇచ్చినా కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం లో విఫలం అయ్యారు రెండు రాష్ట్రాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. భారత దేశం సాప్ట్ వేర్, ఐటి రంగాల్లో అభివృద్ధి సాధించిందంటే అందుకు కారణం రాజీవ్ గాంధీ సాప్ట్ వేర్, ఐటీ రంగాల్లో ఈనాడు కోట్ల మంది ప్రజలు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన కృషే కారణ మన్నారు.ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించాలన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హయాం లో ఉపాధి హామీ పథకం తీసుకువచ్చి దేశ వ్యాప్తంగా గ్రామ గ్రామాన పేదలకు ఉపాధి కల్పించారన్నారు.ఈ పదేళ్ల బీజేపీ ప్రభుత్వం లో మహిళల ఉపాధి, యువతకు ఉద్యోగాలు, పేదలకు న్యాయం జరిగిందని చెప్పగలరా? అని ప్రశ్నించారు. విదేశాల్లోని నల్లధనం తీసుకువచ్చి ఒక్కొక్కరి బ్యాంక్ అకౌంట్ లో 15 లక్షలు వేస్తానని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని దేశ ప్రజలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కేసీఆర్, జగన్, చంద్రబాబు లు మోడీ నీడలోనే పాలన కొనసాగించారు 300 కాంగ్రెస్ ఎంపి స్థానాల ను గెలిపించి దేశ ప్రజలు రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి ని చేసే ఆలోచన చేయాలి మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి రాహుల్ గాంధీ , రాహుల్ గాంధీ కుటుంబం మన్నారు.















