EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, జాగ్రఫీ నూతన కోర్సులు ప్రారంభం 

ఈతరం భారతం హైదరాబాద్, సెప్టెంబర్ 14 సోమవారం:

_____________________________________________

డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎమ్మెస్సీ జాగ్రఫీ కోర్సులను ప్రారంభించినట్లు విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ (LSSB) డా. వై. వెంకటేశ్వర్లు  మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో MBA, అడ్మిషన్స్ తీసుకునే విద్యార్థులు Telangana ICET గాని,డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో గాని అర్హత సాధించాలన్నారు. MA, M.Com, MSc, MBA, UG, PG Diploma కోర్సులకు కూడా దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు సెప్టెంబర్ 30 లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు www.braouonline.in, వెబ్‌ సైట్‌లో admission registration చేసుకుని ప్రింట్స్ తీసుకుని మీరు ఎంచుకున్న స్టడీ సెంటర్‌లో సంప్రదించాలన్నారు. MBA హాస్పిటల్, అండ్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ సెప్టెంబర్ 22 తేదీన యూనివర్సిటీ హెడ్ క్వార్టర్ జూబ్లీహిల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బర్ల మహేందర్, దాసు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top