ఈతరం భారతం/హైదరాబాద్ /నవంబర్ 1 :
రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చే సింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రా మకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్లాగ్షిప్ అభివృద్ధి కార్యక్రమాల అమలు విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌ను ప్రభు త్వం నియమించింది. ఈయన దీంతోపాటు సం క్షేమశాఖ ప్రత్యేక సిఎస్‌గా కొనసాగనున్నారు. ర వాణా శాఖ కమిషనర్‌గా కె.ఇలంబర్తిని నియమించడంతో పాటు పశుసంవర్ధకశాఖ కార్యదర్శి గా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించా రు. గిరిజన సంక్షేమ కార్యదర్శి, కమిషనర్‌గా అ నితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. జీఏడి పొలిటికల్ ఇన్‌చార్జీగా ఇ. శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు, ఆయిల్‌ఫెడ్ ఎండి గా యాస్మిన్ భాషాకు అదనపు బాధ్యతలు, ఎస్సీ అభివృద్ధి కమిషనర్‌గా జి. జితేందర్ రెడ్డిని నియమించడంతో పాటు ఎస్సీ సహకార సంస్థ ఎండి గా అదనపు బాధ్యతలు కల్పించారు. ఇక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు ఇన్చార్జీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం సిఎస్ వద్దే మెట్రో పాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శి బాధ్యతలను ఉంచుకున్నారు
.















