ఈతరం భారతం/హైదరాబాద్/ నవంబర్ 4 :
“గుర్తు తెలియని వ్యక్తులు కొందరు తనపై స్వల్ప కాలిక మత్తు ప్రయోగం చేసినట్టు అనుమానం గా ఉంది” అని పేర్కొంటూ..పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ మంగళవారం నాడు చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళ్తే..రఘునందన్ సోమవారం నాడు చింతపల్లి సాయిబాబ ఆలయం దర్శనం చేసుకున్నారు.తదనంతరం గుడి సమీపం లో ఉన్న ఓ హోటల్ లో అల్పాహారం కోసం ఆగారు.రఘునందన్ అక్కడ కూర్చున్న సమయం లో..గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆయన్ని సమీపించి “మీరు పౌర సరఫరాల శాఖ డి టి కదా సార్.!” మేం ఇక్కడ లోకల్, మీరు తనిఖీలు బాగా చేస్తున్నారు. అంతే గాక టుబాకో కంట్రోల్ లో హీరో అవార్డు కూడా మీకు వచ్చింది కదా సార్..అంటూ టీ అఫర్ చేశారని.టీ తాగాక తల తిరుగుతున్నట్టు, ఏదో మత్తు లో ఉన్న భావన కలిగిందని,ఏదో దురుద్దేశంతో నే..సదరు గుర్తు తెలియని వ్యక్తులు తనకు మత్తు కలిగేలా..వారు తనకు ఇచ్చిన టి లో ఏదో కలిపి ఇచ్చినట్టు అనుమానం ఉందని..రఘునందన్ చింతపల్లి పోలీసులకు ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదు లో పేర్కొనారు.ఈ మేరకు చింతపల్లి ఎస్ ఐ ని కలసి ఫిర్యాదు ను సమర్పించారు.ఓ ఇరవై నిమిషాల పాటు తను ఏమ్ మాట్లాడానో..తెలియని పరిస్థితి లో ఉన్నట్టు, కాసేపాగి తేరుకున్నాక చింతపల్లి నుంచి నల్గొండ వెళ్లానని ఎస్ ఐ కి జరిగిన సంగతి వివరించారు. చింతపల్లి లో కొందరు వ్యక్తులు రేషన్ బియ్యం అక్రమ దందా చేసే వాళ్లు తనను టార్గెట్ గా చేసుకుని ఉండవచ్చు అని ,ఈ నేపధ్యం లో నే.. జరిగిన మత్తు ప్రయోగం పై అనుమానం ఉందని రఘునందన్ ఎస్ ఐ కి వివరించారు. ఎక్స్(ట్విట్టర్) లో సైతం నల్గొండ పోలీసులకు సదరు ఫిర్యాదు ను సమర్పించారు.















