‘‘చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ రావడం అందరికీ సంతోషంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలూ చంద్రబాబుకు నీరాజనం పట్టారు. రాజమండ్రి నుంచి ఇంటికి చేరడానికి 14 గంటల సమయం పట్టింది. బెయిల్ వచ్చే ముందు రోజు కూడా అక్రమ కేసులు పెట్టారు. మద్యంలో అవినీతి చేసి జగన్ లక్ష కోట్లు సంపాదించారు. ఇపుడు చంద్రబాబు, కొల్లు రవీంద్రపై కేసులు పెడతారా?, ఒకవేళ కేసు పెడితే అప్పటి ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం రెడ్డిపై పెట్టాలి. డబ్బు మదం ఉన్న వాళ్లే మద్యం తాగుతారన్న మంత్రి బొత్స వ్యాఖ్యలు తప్పు బడుతున్నాం. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న బొత్స… వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆయన సీనియారిటీ తగ్గింది’’ అని అనిత వ్యాఖ్యానించారు.















