ఈతరం భారతం/హైదరాబాద్ (యాదాద్రి భువనగిరి) నవంబర్ 5:
“పవిత్ర ఆలయాల పరిరక్షణ రాజకీయ ఉద్యమం కాదు… ప్రజల విశ్వాసాన్ని రక్షించుకునే ధర్మ యుద్ధం.”అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పిఎంవికేవై తెలంగాణా రాష్ట్ర కన్వినర్ మాజీ పార్లమెంట్ సభ్యులు డా. బూర నర్సయ్య గౌడ్ అన్నారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను తక్షణమే నిలిపివేయాలి అన్న ప్రదాన డిమాండ్‌తో బీజేపీ శ్రేణులు భక్తులతో కలిసి భజన కార్యక్రమం మరియు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ “శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి పవిత్ర యాదాద్రి ఆలయంలో ఇటీవల బయటపడుతున్న అవినీతి, అక్రమ వ్యవహారాలు భక్తుల హృదయాలను కలచివేస్తున్నాయి. దేవాలయ సంప్రదాయాలకు విరుద్ధంగా జరుగుతున్న ప్రక్రియలను అంగీకరించలేము. ఈ అవకతవకలు వెంటనే నిలిపివేయాలని, ఆలయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసంమాత్రం ఉపయోగించవద్దని ప్రభుత్వం మరియు ఎండోమెంట్స్ శాఖకు కఠినంగా హెచ్చరిస్తున్నాము.”అలాగే ఆయన అన్నారు.దేవాలయాల పవిత్రతను కాపాడటం ప్రభుత్వానికి బాధ్యత.➡️ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను తక్షణమే నిలిపివేయాలి.➡️ యాదాద్రి ఆలయ పరిరక్షణ కోసం మా పోరాటం కొనసాగుతుందని హెచ్చ రించారు. భక్తి, ధర్మం కోసం జరిగే ఈ పోరాటంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.















