ఈతరం భారతం/ఏన్కూర్ పోలీస్ స్టేషన్ ఖమ్మం/నవంబర్ 6:
TGRJC రెసిడెన్షియల్ కాలేజ్ విద్యార్థులకు సైబర్ నేరాలపై ఏన్కూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఎస్సై అవగాహన కార్యక్రమం…సైబర్ నేరం జరిగిన గంటలోపు1930 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని ఏన్కూర్ ఎస్సై సంధ్య తెలిపారు. అపరిచితులు లేదా అనుమానాస్పద కాల్స్ , సందేశాలకు మీ బ్యాంకు వివరాలు, వ్యక్తిగత వివరాలు తెలియజేయవద్దన్నారు. ఫోన్‌లో ఓటీపీ, అలాగే ఓఎల్ఎక్స్, పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, ఈ-కేవైసీ అప్‌డేట్ వివరాలు అడిగితే ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడదన్నారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని,బలమైన పాస్‌వర్డ్‌లను తరచుగా మార్చాలన్నారు.















