ఈతరం భారతం/ఖమ్మం/ నవంబర్ 06:
పేదింటి పూల వ్యాపారి కూతురు పెళ్లికి ఆర్ధిక సహాయం నిత్యావసర వస్తువులు అందించిన ఖమ్మం టౌన్ ఫ్లవర్ మర్చంట్ యూనియన్ కమిటీ సభ్యులు గురువారం యూనియన్ ఖమ్మం టౌన్ కార్యాలయం నందు డి.శ్రీనివాస్ నాయక్ (లేటు) డి.మంగమ్మ కూమార్తె పెళ్ళి జరగనున్న సందర్భంగా రూ.15000/-ల రూపాయలు నగదు మరియు అరక్వింటా బియ్యం నిత్యావసర వస్తువులు అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు షేక్. మోయిన్, షేక్. ఖాజా మాట్లాడుతూ. గత 40 సంవత్సరాల నుండి కమాన్ బజార్ రావి చెట్టు దగ్గర పూల వ్యాపారం చేస్తున్న డి. శ్రీనివాస్ నాయక్ (లేటు) డి. మంగమ్మ నిరుపేద కుటుంబం పూల వ్యాపారంతో జీవనం కొనస్తున్నారని వారి కుమార్తె వివాహానికి ఆర్ధిక సహాయం అందించామని ఈవిధమైన సాయ సహాకారలు ఖమ్మం నగరంలో పూలవ్యాపారం చెస్తున్న వారికి అనేక విధాలుగా అందిస్తూ ఖమ్మం ఫ్లవర్ మర్చంట్ యూనియన్ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం టౌన్ ఫ్లవర్ మర్చంట్ యూనియన్ కోశాధికారి షేక్ షాబాజ్ అహ్మద్, జాయింట్ సెక్రెటరీ ఆర్.వెంకన్న, కన్వీనర్ మహమ్మద్ ముజాహిద్, ఇంచార్జ్ షేక్ ఇస్మాయిల్, సిపిఐ నాయకులు డుంగ్రోతు. శేఖర్ నాయక్, షేక్. లాల్ బి తదితరులు పాల్గొన్నారు.















