ఈతరం భారతం /హైదరాబాద్ /నవంబర్ 6:
రాష్ట్రంలో ఎక్సెజ్ శాఖ మరోసారి తన సత్తా చాటింది. ఒక్కనెలలోనే రూ.6,348 కోట్ల ఆదాయం వచ్చింది. ఇటీవల ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన మద్యం పాలసీలో భాగంగా అందిన దరఖాస్తుల ఫీజులు, లైసెన్స్ ఫీజుల రూపంలో రూ.3,180 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు ఎక్సెజ్ శాఖ వెల్లడించింది. మరోవైపు అక్టోబరు నెలలో వరుస పండుగలు రావడంతో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దీంతో రికార్డు స్థాయిలో రూ.3,168 కోట్ల ఆదాయం సమకూరింది.















