ఈతరం భారతం/ హైదరాబాద్/ నవంబర్ 8:
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం అన్ని మాసాలతో పోలిస్తే కార్తీక మాసం చాలా పవిత్రమైంది. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో నెలంతా భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. ప్రతిరోజు తెల్లవారుజామునే కార్తీక స్నానమాచరించి.. కార్తీక దీపం వెలిగిస్తారు.
అక్టోబర్ 22న మొదలైన కార్తీకమాసం నవంబర్ 20న అమావాస్యతో ముగుస్తుంది. ఇప్పటికే నవంబర్ 8 నాటికి రెండు సోమవారాలు ఏకాదశి పౌర్ణమి ముగిశాయి. ఇక నవంబర్ 10న మూడవ కార్తీక సోమవారం ముగియనుంది.
ఇక మూడవ చివరి సోమ వారం రోజు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి కైలాసానికి వెళ్లాడని పురాణాలు చెబుతున్నాయి. ఆరోజున పార్వతీ పరమేశ్వరులు విష్ణుమూర్తి దంపతులను సాధారంగా ఆహ్వానిస్తారట ఆరోజు చేసే ప్రతాలు పూజ లు దానాలతో విష్ణుమూర్తి సంతృప్తి చెందుతాడని పురాణాలు చెబుతున్నా యి.. కార్తీక మాసం మూడో సోమవారం నవంబర్ 10న చేసే పూజల వలన శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.















