EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎల్ఐసి కి పునాదులుగా వున్న ఏజెంట్లను నష్ట పరచడమే కేంద్ర ప్రభుత్వం ఎజెండా

ఈతరం భారతం/ఖమ్మం/ నవంబర్ 9:రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్, మధుశ్రీ నలుబోల.

ఎల్ఐసిని కార్పోరేట్ల పరం చేయడానికి అడుగడుగునా అడ్డు పడుతున్న ఎల్ఐసి ఏజెంట్లను నష్ట పరచడమే కేంద్ర ప్రభుత్వం యొక్క ఎజెండాగా మారిందని ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి ఎఒఐ) ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి పి.జి.దిలీప్ విమర్శించారు. ఖమ్మంలో జరుగుతున్న ఎల్ఐసి ఎఒఐ సౌత్ సెంట్రల్ జోనల్ 6వ మహాసభల రెండవరోజు మహాసభ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భారత దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల పొదుపు విధానానికి ఎల్ఐసి ఎనలేని కృషి చేస్తుందని అన్నారు. అటువంటి ఎల్ఐసిని కేవలం కొందరు కార్పోరేట్ సంస్థల యజమానుల కోసం ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ఐఆర్డిఎఐ ని అడ్డు పెట్టుకొని ఏజెంట్లకు నష్టం కలిగించే పనులు చేస్తుందన్నారు. అందులో భాగంగానే ఏజెంట్ల కమీషన్ తగ్గించడం, క్లా-బ్యాక్ కమీషన్ విధానం తీసుకుని రావడం, బీమా సుగం పోర్టల్ ప్రతిపాదన, పాలసీ పోర్టబిలిటి, కమీషన్ విధానం మ్యూచువల్ ఫండ్ కంపెనీల మాదిరిగా వుండాలనే ప్రతిపాదన మొదలైనవన్నీ ఇందులో భాగమేనన్నారు.

ఇది ఏజెంట్లకు పరీక్షా సమయమని, ఇటువంటి సమయంలోనే ఏజెంట్ల ఐక్యత చాటాలన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న యూనియన్ సభ్యత్వాన్ని మూడు రెట్లు పెంచుకోవాలన్నారు. ఎల్ఐసి ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను పాలసీ దారులు కూడా వివరిచి చైతన్య పరచాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ ఆల్ ఇండియా అధ్యక్షులు సురజిత్ కుమార్ బోస్, జోనల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యల్. మంజునాధ్, పి.యల్. నరసింహారావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాళ్ళూరి శ్రీనివాసరావు, తన్నీరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.జోనల్ కమిటి నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బి. జయరామ, పి.యల్. నరసింహారావు మహాసభ 141 మందితో నూతన కౌన్సిల్, 69 మంతో కమిటీని, 27 మందితో ఆఫీస్ బేరర్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అధ్యక్షులుగా బి.జయరామ, ప్రధాన కార్యదర్శిగా పి.యల్. నరసింహారావు, ట్రెజరర్ గా వలి మొహిద్దీన్‌, ఉపాధ్యకులుగా టి.కోటేశ్వరరావు, డి.సి.శివమూర్తి, తాళ్ళూరి శ్రీనివాసరావు, టి.నాగరత్నమ్మ, జి.శ్రీనివాస్, కె.రామనర్సయ్య, యం.నాగరాజు, ఆర్.శివ రుద్రమ్మ, యస్. లింగ వాడియా, ఎ.యస్.లోకేష్ షెట్టర్, కార్యదర్శులుగా కె.కృష్ణా రెడ్డి, జి.రవి కిషోర్, సి.ప్రదీప్, తన్నీరు కుమార్, యన్.ఆర్.ఠాగూర్, జి.జి.సవిత, యం.అరుణ, కె.ఉదయలక్ష్మి, బి.వెంకట్రావు ఎన్నికయ్యారు.

 

Related News

Select the Topic
Scroll to Top