ఈతరం భారతం/హైదరాబాద్/ నవంబర్ 11:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈరోజు పంజాగుట్ట పోలీసులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాపారావు, అనంతకృష్ణ లను అన్యాయంగా అరెస్ట్ చేసి, వారి మొబైల్ ఫోన్లు గుంజుకోవడం, మానసికంగా వేధిస్తున్నటువంటి చర్యలను బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్థకు విరుద్ధమైనవని ఆయన పెర్కొన్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికీ, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా రోడ్లపై డబ్బులు పంచడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలు జరిగినప్పటికీ పోలీసులు కనీసం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. మరోవైపు అధికార దుర్వినియోగంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన బిజెపి నాయకులను మాత్రమే టార్గెట్ చేసి అరెస్ట్ చేయడం దుర్మార్గ మని విమర్శించారు.ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ పాపారావు , అనంతకృష్ణ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ ఆయన డిమాండ్ చేసారు.. పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లకు లొంగి అమానుషంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.. ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా పోలీసులు తక్షణం సరిదిద్దుకోవాలని ఆయన హెచ్చరించారు.















