EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

టెట్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 29

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 15

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్ -2025) రెండో విడత నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు శనివారం(నవంబర్ 15) నుంచి ఈనెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు._జనవరి 3 నుంచి 31వ తేదీ మధ్య ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 2025లో మొదటి విడత పరీక్షను జూన్‌లో నిర్వహించగా, తాజాగా రెండో ఈ ఏడాది నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ప్రభుత్వ టీచర్లుగా పని చేస్తున్న వారు ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్ పాస్ కావడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు సెప్టెంబరు 1వ తేదీన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారు సైతం ఈసారి టెట్‌కు పోటీ పడనున్నారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా టెట్ రాసి, అందులో ఉత్తీర్ణత పొందాలి. టెట్ పేపర్-1కు డి.ఇడి, పేపర్ -2కు బి.ఇడి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

Related News

Select the Topic
Scroll to Top