ఈతరం భారతం నవంబర్ 19 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఖమ్మం:
ఖమ్మం కాలవడ్డు మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం కోసం భారీ యంత్రాలను ఉపయోగిస్తున్న నేపథ్యంలో పాత బ్రిడ్జి పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బెల్లం సత్యనారాయణ తెలిపారు ఈనెల అనగా నవంబర్ 20వ తేదీ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మున్నేరు పాత వంతెన పై వాహనాల రాకపోకలు నిలిపి వేస్తున్నట్లు తెలిపారు ప్రజలు గమనించి ఆయా సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణం కొనసాగించాలని తెలిపారు















