ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 19
తెలంగాణ బిసిసంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఉద్యమ నాయకుడు పొన్నం ప్రభాకర్ ని కలిసి తెలంగాణ ఉద్యమ కారుల కి ఇచ్చిన హామీల అమలు పై చర్చించటం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నేను తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ సభ్యుడిని అని హామీల అమలు భాధ్యత నా పైన ఉన్నది ఇప్పటికే ఆలస్యం అయినది ఇప్పుడు తప్పకుండా ముఖ్య మంత్రి తో త్వరలోనే మాట్లాడి హామీల అమలు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ రాష్ట్ర కమిటీ డా.చీమ శ్రీనివాస్ చైర్మన్. సురేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి జగన్ యాదవ్. వీరస్వామి. భాను ప్రకాశ్ రెడ్డి. జానకి రెడ్డి. పుట్నాల కృష్ణ.ఇందర్ కుమార్.మాణిక్యం. జగన్. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.















