EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నేషనల్ క్యాడెట్ కార్ప్స్ కృషి ప్రశంసనీయం

ఈతరం భారతం నవంబర్ 21:శ్రీ కృష్ణ ప్రసాద్ పోలీస్ వెల్ఫేర్ స్కూల్ ఖమ్మం..

రేపటి పౌరుల్లో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి పెంపొందించడంలో (ఎన్సీసీ) నేషనల్ క్యాడెట్ కార్ప్స్ కృషి ప్రశంసనీయమని శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ పోలీస్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాల చైర్ పర్సన్ నిష్టాశర్మ అన్నారు.భారతదేశంలో 77 వ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా 32 మంది NCC విద్యార్థులకు ఏ గ్రేడ్సర్టిఫికెట్స్ అందజేశారు.

 ఈ సందర్భంగా స్కూల్ చైర్పర్సన్ మాట్లాడుతూ… దేశ నిర్మాణంలో క్యాడెట్లలో నిస్వార్థ సేవ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం NCC ముఖ్యం లక్ష్యం మని అన్నారు. ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు, ఈ యువ బృందాలు ఆపన్న హస్తం అందించాయని, కొవిడ్-19 లాంటి సహాయక చర్యలలో ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల విశ్వసనీయతకు నిదర్శనం మని అన్నారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఆర్ ఐ కామరాజు, స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు.

 

                   

Related News

Select the Topic
Scroll to Top