EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మహా కుంకుమార్చన  3000 మంది మహిళలతో గౌరీ పాడ్యమి కుంకుమ పూజలు

ఈతరం భారతం నవంబర్ 21 ఖమ్మం:

3000 మంది మహిళలతో గౌరీ పాడ్యమి కుంకుమ పూజలు.శ్రీ భ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం గౌరీ పాడ్యమి సందర్భంగా మహా కుంకుమార్చన నిర్వహించడం జరిగింది.అనంతరం మహా అన్నదానం.కార్తీక మాస ముగింపు గౌరీ పాడ్యమి పురస్కరించుకొని సుమారు 20వేల మందికి మహా అన్నదానం నిర్వహించడం జరిగింది.శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాస ముగింపు సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు ఏ బ్లాక్ అధ్యక్షులు ఖమ్మం పట్టణ ఎర్రం బాలగంగాధర్ తిలక్, కార్పొరేటర్లు కన్నం వైష్ణవి, ఎల్లంపల్లి వెంకట్రావు, వాసంశెట్టి నరసింహారావు మహా అన్నదానాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ ప్రాచీనమైన స్వయంభు దేవస్థానమైన గుంటు మల్లేశ్వర స్వామి కార్తీక మాసం లో అనేక విశేష పూజలు అందుకుని చివరి రోజున మహా అన్నదానం ఆనవాయితీగా వస్తుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వాహణాధికారి చుండూరు రామకోటేశ్వరరావు , భక్త బృందం చైర్మన్ మాడిశెట్టి మదన్మోహన్, ఆలయ అర్చకులు దాములూరి కృష్ణ శర్మ, వీరభద్ర శర్మ, ఎగ్నిక బ్రహ్మ చిట్టా ఆంజనేయ శర్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బో జెడ్ల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు బాణాల లక్ష్మణ్ తొగర భాస్కర్, లింగ స్వామి మధు, భక్త బృందం సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

 

 

Related News

Select the Topic
Scroll to Top