EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కెపిహెచ్ బి నైన్త్ పేజ్ లో ఘనంగా శ్రీ భగవాన్ సత్య సాయి బాబా శత వసంతాల వేడుకలు 

ఈతరం భారతంహైదరాబాద్ నవంబర్ 23

శ్రీ ఆంజనేయ ఆది లీల ఫౌండేషన్ న్యూఢిల్లీ సంస్థ, మాతృదేవోభవ సంస్థ, మన రామ రాజ్యం సాయి సి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కెపిహెచ్ బి నైన్త్ పేజ్ లోని శ్రీ సిద్ధి బుద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీ భగవాన్ సత్య సాయి బాబా శత వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఉదయం 8:30 కి ప్రార్థనతో ప్రారంభమై భజన సంకీర్తనలతో ఉపన్యాసాలతో ఈ కార్యక్రమం ప్రారంభమై అన్నదాన వితరణతో ఈ కార్యక్రమం ముగిసింది. భక్తులు అనంతపురం, కడప కర్నూలు జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి హాజరై భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేశిరాజు రాంప్రసాద్ మాట్లాడుతూ భగవాన్ సత్య సాయిబాబా జీవిత విశేషాలను వారి నిర్వహించిన సేవా కార్యక్రమాలను, భక్తులు యొక్క అనుభవాలను, వారి సొంత అనుభవాలను భగవాన్ సత్య సాయి బాబా గురించి వివరించారు.శివాజీ మహారాజ్ క్షాత్ర పరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీ శ్రీ యోగేష్ మహారాజ్ మాట్లాడుతూ ఇతరుల మనుషుల కష్టాలకు స్పందించే సాయం చేసినప్పుడు మాత్రమే మానవ జన్మ సార్థకం అవుతుందని, రోజు భగవద్గీతను చదవడం వల్ల జ్ఞానసిద్ధి మోక్షసిద్ధి కలుగుతాయని, మనుషులు స్వార్థ చింతన మాని, భగవత్ చింతన చేయాలని, అమ్మానాన్నల గౌరవించాలని అన్నారు. షిరిడి సాయి ప్రచారకులు శ్రీనివాసులు మాట్లాడుతూ షిరిడి సాయి పుట్టపర్తి సాయి ఇద్దరి జీవిత లక్ష్యాలు ఆశయాలు ఒకటేనని, ఇద్దరి జీవితము అన్నదాన సేవతోనే తరించిందని అన్నారు.మాతృదేవోభవ అధ్యక్షులు కే సాయి శ్రీధర్ మాట్లాడితే అన్నదాన కార్యక్రమ విశేషతను వివరించారు. న్యూఢిల్లీ నుంచి వచ్చిన యోగేశ్వర నాయక్ సత్య సాయి లోని మాతృ తత్వాన్ని వివరించారు. మన రామరాజ్యం ఫౌండేషన్ చైర్మన్ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఉదయం ప్రసాద వితరణను చేశారు ఈ కార్యక్రమంలో అతిధులుగా రామకృష్ణంరాజు సీతారామరాజు ఇంకా ఎందరో భక్తులు హైదరాబాదు నుంచి నలుమూల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top