ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 23
గురుస్వామి మనుబోతుల రాంబాబు ఆధ్వర్యంలో నల్లకుంట డివిజన్ శ్రీ సాయిరెసీడెన్సీలో ఆయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని కేశవ గురుస్వామి చేత ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. గణపతి హోమంతో పూజ కార్యక్రమంతో ప్రారంభమై ఆయ్యప్పస్వాముల నామస్మరణలతో ఖర్కానలైన్ ప్రాంతమంతా సాయంత్రం వరకు కొనసాగింది. ఈ ఆయ్యప్ప పూజలో ఎం.ఝాన్సీ, గోవర్ధన్రెడ్డి, కిరణ్సాగర్,కత్తుల మధు,పాండు, రజనీ, ప్రేమ్కుమార్,భోగ వెంకటయ్య, రమేశ్, భోగస్వామి, రాములు, చారి, ఆయ్యప్పస్వాములు హాజరై ఆయ్యప్పస్వామిని దర్శించుకున్నారు.















