EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గ్రూప్ 2 అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ 

ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్26:

కోర్ట్ లో కేసు వేసిన 45 మంది గ్రూప్-2 అభ్యర్థులకు ప్రభుత్వం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చొరవచూపి ఉద్యోగ అవకాశం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్ లోని బీసీ భవన్ లో బీసీ నిరుద్యోగ జేఎసి చైర్మెన్ నీలా వెంకటేష్,ఇంద్రా నాయక్ అధ్యక్షతన గ్రూప్-2 అభ్యర్థుల తో సమావేశం జరిగింది . ఈ సమావేశానికి ఎంపీ ఆర్.కృష్ణయ్య హాజరై ప్రసంగించారు. ఇప్పటికే గ్రూప్-2 ద్వారా ఎంపికై అభ్యర్థులు పది సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నారని, కోర్టు ఆదేశాల పేరిట వారిని ఇబ్బంది పెట్టకుండా కేసు వేసిన 45 మంది గ్రూప్-2 అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ ఉద్యోగాలు కల్పిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. టీజీపీఎస్సీ తప్పిదాల కార ణంగా గ్రూప్-2 అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయడం శోచనీయమన్నారు. గ్రూప్-2 పరీక్షకు లక్షల మంది దరాఖాస్తు చేసి పరీక్ష రాయగా 1032 మంది ఉద్యోగాలు సాధించారని, కేవలం 45 మంది కోర్టుకు వెళ్లారని తెలిపారు. 45 మంది కారణంగా 1032 మంది పదేండ్లుగా చేస్తున్న ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని, ప్రభుత్వం అలోచించి 45 మందికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం లో పిటిషన్ వేసిన గ్రూప్ 2 అభ్యర్థులు సుజాతారెడ్డి ,మానస,మాధవి,బాలాజీ,బీసీ సంఘం నాయ కులు నీల వెంకటేశ్, అనంతయ్య, అంజి, ఇందిరా, శివకుమార్, శ్రీవాణి, , అలివేలు లక్ష్మి, శేఖర్, రాజామత్, తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top