EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఫిల్మ్‌నగర్‌లో నకిలీ IPS అధికారి అరెస్ట్

ఈతరం భారతం నవంబర్ 26 హైదరాబాద్:

ఫిల్మ్‌నగర్‌లో నకిలీ ఐపీఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు.శశికాంత్ అనే వ్యక్తి ఐపీఎస్,ఐఏఎస్ అధికారి అంటూ గత కొంతకాలంగా బిల్డర్లు,వ్యాపారులను మోసం చేస్తున్నట్టు విచారణలో బయటపడింది.పోలీసుల సమాచారం ప్రకారం, శశికాంత్ ఇద్దరు గన్‌మెన్లను అద్దెకు పెట్టుకొని నిజమైన అధికారిలా వ్యవహరిస్తూ బిల్డర్లను బెదిరించినట్లు తెలుస్తోంది. ‘స్పెషల్ ఆఫీసర్’ అని చెప్పుకుంటూ పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.బిల్డర్లు ఇచ్చిన ఫిర్యాదులు, సేకరించిన ఆధారాల మేరకు పోలీసులు శశికాంత్‌ను ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు.తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా,గన్‌మెన్లను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.నిందితుడిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top