EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారికీ కౌన్సిలింగ్..: ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు

ఈతరం భారతం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఖమ్మం నవంబర్ 26:

మద్యం మత్తులో ప్రయాణం చేయడం ద్వారా తమ విలువైన ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు అన్నారు. నగరంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన 39మంది వాహనదారులకు జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు ఆనంతరం వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ… మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలకు గురై ఎంతోమంది ప్రాణాలూ పోగొట్టుకుంటున్నప్పటికి వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం,వాహనం ఎటువైపు వెళ్తుందనే ధ్యాస లేకపోవడం, ఒకరు చేసే తప్పు వేరొకరి ప్రాణాల మీదకు తెస్తోందని అన్నారు,

రహదారి భద్రతా నియమావళిని పాటించకుండా నిబంధనలను బేఖాతరు చేస్తూ వాహనాలు నడుపుతున్న వారి వల్లనే ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వివరించారు.

Related News

Select the Topic
Scroll to Top