ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 26
జూబ్లీహిల్స్ ఇన్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం ఈరోజు అసెంబ్లీలో అట్టహాసంగా జరిగింది. కార్యక్రమం లో బిల్డింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నార్మల్ల భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జూబ్లీహిల్స్ ఉపయోగంలో బిల్డింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ నవీన్ యాదవ్ గెలుపుకు పూర్తి మద్దతు ఇచ్చింది. రాబోవు రోజుల్లో ప్రభుత్వం నుంచి రావలసిన పెండింగ్ బిల్లులను విడుదలకు తన వంతు కృషి చేస్తానని నవీన్ యాదవ్ హామీ ఇచ్చారు. అనంతరం నవీన్ యాదవ్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి , గాంధీభవన్ కు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.















