EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

5న బీసీ విస్తృతస్థాయి రాష్ట్ర సమావేశం

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల భవిష్యత్ రాజకీయ కార్యాచరణ పై చర్చించి.. బిసిల రాజకీయ విధానం ప్రకటించడానికి ఈనెల 5వ తేదిన హైదరాబాదులోని సెంట్రల్ కోర్టు హోటల్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులుజాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు జనాబ దామాషా ప్రకారం 60 అసెంబ్లీ స్థానాలను, బీసీలకు ముఖ్యమంత్రి పదవి కావాలనే ప్రధాన డిమాండ్ తో బీసీలు రాజకీయ పోరాటం చేస్తున్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు అగ్రకులాలకే రాజకీయ ప్రాధాన్యత కల్పించి, బీసీలను రాజకీయంగా అణిచివేయాలని చూస్తున్నాయని ఆయన అన్నారు. ఇప్పటివరకు ప్రకటించిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల్లో బీసీలకు తిరని అన్యాయం జరుగుతుందన్నారు,ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు అనుసరించవలసిన రాజకీయ విది,విధానాలపై రాష్ట్ర సమావేశంలో విస్తృతంగా చర్చించి భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ఖరారు చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అత్యంత క్రియాశీలకమైన ఈ సమావేశానికి 33 జిల్లాల నుండి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, స్థాయి ముఖ్య స్థాయి నేతలు హాజరుకావాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు

Related News

Select the Topic
Scroll to Top