EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

విపంచి ఫౌండేషన్ రూపొందించిన “స్టార్ట్ లైబ్రరి- సేవ్ లైబ్రరి” ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రొ.కోదండరామ్ , జాక్ ఛైర్మన్ 

ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 17

విపంచి ఫౌండేషన్ ఆద్వర్యం లో గ్రంథాలయాల ఆవశ్యకత పై రూపొందించిన “స్టార్ట్ లైబ్రరి- సేవ్ లైబ్రరి” అనే నినాదం తో రూపొంచిన ప్రచార పోస్టర్ ను ప్రొఫెసర్ కోదండ రామ్ హైదరాబాద్ లోని ఆయన నివాసం లో ఆవిష్కరించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చదివే అలవాటు అంతరించి పోతున్న ఈ తరుణంలో” స్టార్ట్ లైబ్రరి- సేవ్ లైబ్రరి” అనే నినాదం తో ప్రచార పోస్టర్ రూపొందించి గ్రంథాలయాల అవశ్యకతను గుర్తించడం అభినందనీయం అని ఇది ప్రస్తుత తరుణంలో చాలా కీలకమైన కార్యక్రమం అని ,ఈ మద్య యువత పెడదారిన పడుతుందని దాని నుండి బయట పడటానికి ప్రతి ఒక్కరూ గ్రంథాలయాల ఏర్పాటుకు పూనుకోవాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాల వేదికగా సంస్కృతిక ,క్రీడాకార్యక్రమాలునిర్వహిస్తూ యువతను భాగస్వామ్యం చేస్తే ఆ ఊరు బాగుపడుతుందని తద్వారా యువత వృద్ది చెంది దేశ సంపద ఉత్పత్తి లో భాగస్వాములవుతారని,అందరం కలసి మహనీయులు స్పూర్తి , ఊరూరా గ్రంథాలయాల స్థాపనకు కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు ,తెలంగాణ గ్రంథాలయ సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా శ్రీనివాస్ నేతృత్వం లో ఉభయ తెలుగు రాష్ట్రాలలో గ్రామీణ గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని .తెలంగాణ గ్రంథాలయ సంఘం కూడా ఈ గ్రామీణ గ్రంథాలయాలకు తోడుందని గుర్తు చేశారు . విపంచి ఫౌండేషన్ ఛైర్మన్ అనుముల శ్రీనివాస్ మాట్లాడుతూ ఊరూరా గ్రంథాలయం ఏర్పాటే తమ లక్ష్యమని రచయితలు, మేధావులు ,పుస్తక ప్రేమికులు మరియు యువత అందరూ సహకరించాలని కోరారు .తెలంగాణ స్టడీ ఫోరం అధ్యక్షులు నక్కెర్తి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ విపంచి ఫౌండేషన్ నేతృత్వం లో స్థానిక సంస్థల లో గెలిచిన సర్పంచ్ లు గ్రంథాలయాలు ప్రారంభించాలని సూచించడం వలన తెలంగాణ వ్యాప్తంగా ఒక చలనం వచ్చిందని అన్నారు .అనంతరం నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గాదె వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం గారి సూచనలను పాటిస్తూ విజ్ఞాన ఉద్యమం చేస్తామని అన్నారు .అనంతరం ఫౌండేషన్ గౌరవ సలహాదారు ఆందోజు నాగభూషణము వందన సమర్పణ చేసిన ఈ కార్యక్రమం లో పెద్దపల్లి జిల్లాకి చెందిన వెంకట్రావు పల్లి గ్రంథాలయ సభ్యులు మంద అనిల్ ,రేచవేణి సతీష్ కొమ్మ కుమార్ ,కొమ్మ సతీష్ ,ఎస్‌కే ఉస్మాన్ పాష తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top