ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 18
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేని అదనపు ఫ్లోర్ ల నిర్మాణాలు, సెల్లార్ లు, పార్కింగ్ స్థలాల్లో అక్రమ నిర్మాణాల వలన అపార్ట్మెంట్ ల లోని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారని, కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పై లింగం పెల్లి అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. లింగం పెల్లి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు యన్. విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన వినియోగదారుల చైతన్య సదస్సు లో వినియోగదారుల మండలి రాష్ట్ర అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి, కంన్సూమర్స్ కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు మామిడి భీం రెడ్డి లు ముఖ్య అతిధులుగా హాజరైనారు. లింగం పెల్లి లోని పలు అపార్ట్మెంట్ లతో పాటు, బి.యస్.హబిటెంట్ అపార్ట్మెంట్ లో అనుమతి లేని ఆరవ ఫ్లోర్ వల్ల వాటర్ ట్యాంక్ కు బీటలు ఏర్పడి కూలిపోయే పరిస్థితి, లిఫ్ట్ సరిగా పనిచేయక పోవడం, అక్రమ నిర్మాణాల వల్ల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సంవత్సరాల కొలది పెండింగ్లో ఉంచడం, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని క్రమంలో త్రాగునీటి చార్జీలు ఎక్కువగా చెల్లించడం జరుగుతున్నదని అపార్ట్మెంట్ వినియోగదారులు నేటి సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్ లో అనుమతి లేని నిర్మాణం పై గత రెండు సంవత్సరాల క్రితం తేది 21-10-2023 నుండి ఇప్పటి వరకు శేర్ లింగంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా కూడా అక్రమ నిర్మాణాలను తొలగించడం లేదని, వినియోగదారులు సదస్సు లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వినియోగదారుల నుండి ఫిర్యాదులను సేకరించిన మండలి రాష్ట్ర అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి మాట్లాడుతూ, అపార్ట్మెంట్ ల చట్టం 1987, భవన నిర్మాణ నిబంధనలు 2012 ల ప్రకారం అనుమతులు పొందిన విధంగా నిర్మాణాలు జరగాలని, లేనట్లయితే అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు లు అందిన (15) రోజుల్లో అక్రమ నిర్మాణాలను కార్పొరేషన్ అధికారులు కూల్చి వేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే రెండు సంవత్సరాలుగా వినియోగదారుల సమస్యలను పట్టించుకోని కార్పొరేషన్ అధికారులపై లోకాయుక్త లో ఫిర్యాదు చేస్తున్నట్లు సాంబరాజు చక్రపాణి తెలిపారు. అపార్ట్మెంట్ ల చట్టం ప్రకారం ప్రతీ అపార్ట్మెంట్ లో “అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్” తప్పనిసరి గా ఏర్పడాలని సి.సి.ఐ.రాష్ట్ర అధ్యక్షుడు మామిడి భీం రెడ్డి తెలిపారు. అపార్ట్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు జరిగితేనే బిల్డర్ నుండి హక్కుల బదలాయింపు ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు. లింగం పెల్లి లో అపార్ట్మెంట్ అక్రమ నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడం పై న్యాయపరమైన చర్యలకు వినియోగదారుల రక్షణ చట్టాల ప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం అపార్ట్మెంట్ చట్టాలకు సంబంధించిన అవగాహన పోస్టర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో వివిధ ఫ్లాట్ ఓనర్స్ కార్యవర్గ సభ్యులు యస్. రాము, బి. నవీన్ కూమర్, యం.ఉదయ్ కుమార్, డి.క్రిష్ణ మోహన్, యన్. సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ సభ్యులు న్యాయ వాది సాజీదా ఖాన్, ఫరా సుల్తానాలు సదస్సులో పాల్గొన్నారు.















