EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు….. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఈతరం భారతం ఖమ్మం, డిసెంబర్ -18:

ఖమ్మం జిల్లా పరిధిలో మూడు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఖమ్మం జిల్లా పరిధిలో 566 గ్రామ పంచాయతీలకు 566 సర్పంచ్, 566 ఉప సర్పంచ్, 5168 వార్డు సభ్యులకు సంబంధించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధులలో పాల్గొన్న ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించారని, ఎక్కడ ఎటువంటి పొరపాట్లు రాకుండా కట్టుదిట్టంగా ఎన్నికలను నిర్వహించిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top