ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 20
అడ్వకేట్ యాక్ట్ 1961 ని వెంటనే సవరణ” చేయాలని సీనియర్ న్యాయవాది జిల్లా రమణారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సహచర న్యాయవాదులతో కలిసి సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది జిల్లా రమణా రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల నియమ నిబంధనలు అ’డ్వకేట్ యాక్ట్ 1961′ ప్రకారం రూపొందించబడినవని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ చే రూపొందించ బడివని పేర్కొన్నారు. ‘అడ్వకేట్ యాక్ట్ 1961’ ప్రకారం ప్రతి రాష్ట్ర బార్ కౌన్సిల్ లో ఛైర్మన్, 25 మంది సభ్యులు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టాట్చ్యుటరీ బాడీ పార్లమెంట్ ద్వారా ఏర్పాటు కాబడినదన్నారు. ‘అడ్వకేట్ యాక్ట్ 1961′ నియమ నిబంధనలకు లోబడి బార్ కౌన్సిల్ పనిచేస్తుందన్నారు…”అడ్వకేట్ యాక్ట్ 1961 ని వెంటనే సవరణ” చేయాలని సీనియర్ న్యాయవాది జిల్లా రమణారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సహచర న్యాయవాదులతో కలిసి సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది జిల్లా రమణా రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల నియమ నిబంధనలు అ’డ్వకేట్ యాక్ట్ 1961’ ప్రకారం రూపొందించబడినవని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ చే రూపొందించ బడివని పేర్కొన్నారు. ‘అడ్వకేట్ యాక్ట్ 1961’ ప్రకారం ప్రతి రాష్ట్ర బార్ కౌన్సిల్ లో ఛైర్మన్, 25 మంది సభ్యులు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టాట్చ్యుటరీ బాడీ పార్లమెంట్ ద్వారా ఏర్పాటు కాబడినదన్నారు. ‘అడ్వకేట్ యాక్ట్ 1961’ నియమ నిబంధనలకు లోబడి బార్ కౌన్సిల్ పనిచేస్తుందన్నారు. కానీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటై 6 దశాబ్దాలు కావస్తున్నా చెప్పుకోదగ్గ మార్పులు సంతరించుకోలేదన్నారు. 1950 నుండి ఇప్పటివరకు భారత రాజ్యాంగాన్ని 106 సార్లు సవరణలు చేశారని రమణా రావు తెలిపారు. ఈ సవరణల వెనుక జాతీయ అవసరాలు, గవర్నెన్స్, సామాజిక న్యాయం, ఆర్థిక విధానం వంటివి ఉన్నాయన్నారు. కానీ, అడ్వకేట్ యాక్ట్ 1961 వచ్చిన ఆరు దశాబ్దాల కాలంలో జరిగిన సవరణలు మరియు ఇటీవల కాలంలో 2019, 2023, 2025, 2019: ప్రొవిన్షన్స్ ఫర్ కమింగ్ ఇన్ ఫోర్స్, 2023: 45 A సెక్షన్ ఇంట్రడ్యూస్, 2025: పబ్లిక్ కన్సల్టేషన్ ప్రాసెస్ తో మోడర్నైసేషన్ ది లీగల్ ప్రొఫెషన్ ఎడ్యుకేషన్ 1961 న్యాయవాదుల చట్టం ప్రతిపాదిత సవరణలు, న్యాయ వాద వృత్తిని ఆధునీకరించడం, ప్రాముఖ్యతను మెరుగు పరచడం, దాని స్వతంత్ర్యాన్ని కాపాడుకుంటూ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం లక్ష్యం అన్నారు.బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/ తెలంగాణ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామన్నారు. ‘అడ్వకేట్ యాక్ట్ 1961’ సవరణల కొరకు కేంద్ర ప్రభుత్వానికి కింద పేర్కొన్న అంశాలు ప్రతిపాదించవలసిన అవసరం ఉందని న్యాయవాది జిల్లా రమణా రావు అన్నారు. 1. సామాజిక న్యాయం పాటిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి బార్ కౌన్సిల్ ఎలక్షన్ కు ప్రాతినిధ్యం ఉండాలి. 2.బార్ కౌన్సిల్ సభ్యుల కాలపరిమితి 5 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలకు తగ్గిస్తే అందరికీ అవకాశాలు వస్తాయి. 3. బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో సభ్యులు/ మెంబర్ గా పోటి చేసే అభ్యర్థి గెలిచినా, ఓడినా రెండు పర్యాయాలు మాత్రమే అవకాశం కల్పించాలి. 4. బార్ అసోసియేషన్ కు ఉన్న నిబంధనలను అనుసరించి బార్ కౌన్సిల్ మెంబర్ గా పోటీ చేసే అభ్యర్థికి కనీసం 10 సంవత్సరాల ప్రాక్టీస్ అనుభవం ఉండాలి. బార్ కౌన్సిల్ ఎలక్షన్లలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలి. పైన పేర్కొన్న అంశాల మీద ‘బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/తెలంగాణ’ వారు కేంద్ర ప్రభుత్వానికి సవరణల కొరకు వెంటనే ప్రతిపాదించి, ఈ తెలంగాణ బార్ కౌన్సిల్ ఎలక్షన్/ఇండియా ఎలక్షన్ లో ‘అడ్వకేట్ యాక్ట్ 1961 లో సవరణలు’ తీసుకొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా.. 2023 లా మినిస్ట్రీ రిపోర్ట్ ప్రకారం సుమారు 20 లక్షల మంది న్యాయవాదులకు న్యాయం జరుగుతుందని సినియర్ న్యాయవాది జిల్లా రమణారావు అన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బి.జీవన్ కుమార్, డి.ఈశ్వర ప్రసాద్, ఎ.వి.రమణ, గెర రవి, ఇ.మోహన్ రాములు, దోర్నాల హరికృష్ణ, రాజేందర్, జగన్, బాలసాని సురేష్ గౌడ్, వి.వెంకటేశ్వర్లు, సి.రమేశ్, అంబర్ సింగ్, టి.నారాయణ రెడ్డి, చారి సింగర్, బి.సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.















