EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి..

ఈతరం భారతం ఖమ్మం డిసెంబర్ 21

ఖమ్మం – వరంగల్‌ జాతీయ రహదారిపై  ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఒక్కరు మృతి చెందగా, బస్సులో ప్రయాణిస్తున్న ముప్పై మందకి స్వల్ప గాయాలయైనట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు.పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా వద్ద లారీ టైరు పంచార్ కావడంతో లారీ క్లీనర్ మరమ్మత్తులు చేస్తున్న క్రమంలో బోధన్ డిపో చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు నుంచి నిజామాబాద్ వెళ్తూ లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో లారీ టైరు మారుస్తున్న క్లినర్ నితీష్ కుమార్ రామ్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకుని ఘటన స్థలాన్ని హుటాహుటన చేరుకున్న తిరుమలపాలెం ఎస్సై జగదీష్ గాయపడిన ప్రయాణికులను వైద్యశాలకు, మృతదేహాన్ని మార్చురీకి తరలించి, మృతుడు బీహారు కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top