ఈతరం భారతం ఖమ్మం, మధుశ్రీ నలుబోల డిసెంబర్ 21:
టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా మహాసభలు ఖమ్మం లోని ఎస్సార్ కన్వెన్షన్ నందు డిసెంబర్ 20 తారీకు ఆదివారం అట్టహాసంగా జరిగాయి ఇందులో భాగంగా జర్నలిస్టులకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా యూనియన్ పాటు పడుతుందని టి డబ్ల్యూ జేఎఫ్ కార్యవర్గం పేర్కొంది ఖమ్మం జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారి మహిళలకు ప్రాధాన్యమించి రాష్ట్ర కమిటీకి మహిళను ఎన్నుకోవడం అభినందనీయం.
హింది జాతీయ పత్రిక లో పనిచేస్తున్న నలుబోల మధుశ్రీ ని రాష్ట్ర కమిటీ కి ఎన్నిక చేసారు. ముఖ్య అతిథులుగా హౌసింగ్, రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొనాల్సి ఉండగా వారి అత్యవసర కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వెళ్ళినందున వారి తరఫున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ కాల్ లో మాట్లాడి మీటింగ్ హాల్లో ఉన్న జర్నలిస్టులందరికీ ఆయన సందేశాన్ని వినిపించారు అందులో భాగంగా 2025 సంవత్సరం చివరిలోగా అంటే ఈ 10 రోజులలో అక్రిడేషన్ కార్డుల కోసం తప్పకుండా మంచి శుభవార్త చెప్తానని అలాగే 2026 కొత్త సంవత్సరంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయమై మంచి తీపి కబురు అందిస్తానని టీ డబ్ల్యూ జేఎఫ్ కు హామీ ఇవ్వడం జరిగింది.. వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్ ఈ సమావేశానికి హాజరై ఎల్లవేళలా జర్నలిస్టులకు అండగా ఉంటానని ఎప్పుడూ ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తానని హామీ ఇవ్వడం ఇచ్చారు.మరొక అతిథి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ పాల్గొని వారి సందేశాన్ని వినిపించారు అలాగే మహిళలు జర్నలిస్టు రంగంలో ముందుకెళ్తున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు మహిళల సమస్యలపై రాత్రివేళ వారి ప్రయాణాల విషయమై చర్చించారు. అనంతరం కొత్త కార్య వర్గాన్ని ఎన్నుకున్నారు అందులో భాగంగా జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డిలు కాగా ఉపాధ్యక్షులు దువాసాగర్ లను ఎన్నుకున్నారు అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను, ఎలక్ట్రాన్ మీడియా కమిటీ,వీడియో జర్నలిస్టుల కమిటీ నగర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో రాష్ట్ర కార్యవర్గంలో సీనియర్ పాత్రికేయులు సత్తుపల్లి డివిజన్ నుండి బాలకృష్ణ ఖమ్మం నుండి మా రెడ్డి నాగేందర్ రెడ్డి మరియు నలుబోల మధుశ్రీ ఎన్నికయ్యారు.















