ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 22
బేగంపేటలోని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా మరో ప్రపంచ రికార్డుకు సిద్ధమైంది. ఇప్పటికే ఐదు 5 రికార్డులు సాధించిన సంస్థ ఇప్పుడు మరో రికార్డు పై దృష్టి పెట్టింది. పూర్వ కాలం మన తాతలు ముత్తాతలు తయారు చేసిన సంప్రదాయ వంటకాలను నేటి తరం విద్యార్థులు తయారుచేసి ఔరా అనిపించారు. కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన వంటకాలు మాత్రమే కాదు…దేశములోని వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రసిద్ధి వంటకాలను తయారు చేశారు. క్రిస్మస్ సందర్భంగా పరంపరగాట పాక కళ పేరుతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 104 వంటకాలను, 104 మంది విద్యార్థులు విద్యార్థులు తయారు చేయడం విశేషం. ఆ రోజుల్లో ఏ విధంగా వంటకాలు తయారు చేశారో… ఆ విధంగానే చేయడం మరో విశేషం.ఇందులో ఎలాంటి గ్యాస్ స్టవ్ వినియోగించకుండా ….కేవలం కట్టెల పొయ్యి, పొట్టు పొయ్యి మట్టి పోయి ఇసుక తో వంట చేయడం…. ఇలా అనాడు మన పూర్వీకులు చేసిన విధానం మన కళ్ళముందు ప్రత్యక్షంగా చూపించారు. ఇలా ఇప్పటి వరకు ప్రపంచంలో ఒకే సారి వందకు పైన….ఏకకాలంలో వందమంది కి పైగా వంటకాలను చేయలేదని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా చైర్మన్ సుధాకర్ రావు తెలిపారు. మన పూర్వీకులు ఆయిల్ లేకుండానే వంటకాలను అద్భుతంగా తయారు చేశారని… ఆనాటి ఆ వంటకాలను నేటి యువతరం రీసెర్చ్ చేసి తయారు చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇప్పటికే పలు రికార్డులు వచ్చాయని….ఈ రికార్డు సైతం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలకు చెందిన చెఫ్ మాస్టర్స్ తోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన వంటకాలను విధానాన్ని చూసి విద్యార్థులను అభినందించారు.















