ఈతరం భారతం సంగారెడ్డి డిసెంబర్ 23
వచ్చే నెల జనవరి 9,10,11 వ తేదీలలో జరగనున్న ఫతే ఖాన్ దర్గా ఉర్సు ఉత్సవాలుఫతేఖాన్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ గా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.సంగారెడ్డి ఫతే ఖాన్ దర్గా ఉర్సు ఉత్సవ ఏర్పాట్ల పై వక్ఫ్ బోర్డు, మున్సిపల్, విద్యుత్ అధికారులు, మైనార్టీ నాయకుల తో జగ్గారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు….ఉర్సు సందర్భంగా ఫతే ఖాన్ దర్గా తో పాటు పరిసరాలు అంతటా, నాల్సాబ్ గడ్డ నుండి పాత బస్టాండ్ వరకు, జేసీ ఇంటి నుండి ఫతే ఖాన్ దర్గా వరకు, కోర్టు నుండి నాల్సాబ్ గడ్డ వరకు, ఎమ్మార్వో ఆఫీస్ నుండి ఓల్డ్ ఆర్డీవో ఆఫీస్ వరకు పూర్తిగా లైటింగ్ ఏర్పాట్లు చేయాలని సూచనలు చేసారు… హిందూ , ముస్లిం, క్రిస్టియన్ల పండుగలు ఏవైనా నేను నాన్ పొలిటికల్ గా పాల్గొంటాను, నా సహకారం అందిస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, నేను సంగారెడ్డి పట్టణానికి చెందిన వాడిని కాబట్టి ఇక్కడకు వచ్చాను…. ఉర్సు ఉత్సవ కమిటీ ఆధ్వర్యం లో ఏర్పాట్లు జరుగుతాయి. వారికి నా సహకారం ఉంటుంది…. అనధికారికంగా నేను ఏం చేయాలో చేస్తాను, అధికారికంగా ప్రభుత్వం తరపున ఏర్పాట్లు పక్కా గా జరగాలి… ఉర్సు సందర్భంగా ఫతే ఖాన్ దర్గా తో పాటు పరిసరాలు అంతటా, నాల్సాబ్ గడ్డ నుండి పాత బస్టాండ్ వరకు, జేసీ ఇంటి నుండి ఫతే ఖాన్ దర్గా వరకు, దర్గా ఉన్న కాలనీ లో పూర్తిగా లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. లైటింగ్, టెంట్, సౌండ్ జెనరేటర్, పెయింటింగ్, మొబైల్ టాయిలెట్స్ కావాలని కోరిన ఉత్సవ కమిటీ నాయకులు… లైటింగ్, టెంట్, సౌండ్ లాంటి ఏర్పాట్లు మున్సిపల్ అధికారులు చేస్తారని పెయింటింగ్ తో పాటు మూడు నుండి నాలుగు వేల మందికి భోజన ఏర్పాట్లు తన స్వంత ఖర్చులతో చేస్తానని జగ్గారెడ్డితెలిపారు. మంత్రి దామోదర, ఇంఛార్జ్ మంత్రి వివేక్, స్థానిక ఎంపి, స్థానిక ఎమ్మెల్యే కు, టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కి అధికారికంగా ఆహ్వానాలు అందించాలని వక్ఫ్ బోర్డు అధికారులకు సూచన…. జనవరి నెల 6 వ తేదీ వరకు ఏర్పాట్లు అన్ని పూర్తి కావాలని . 6 వ తేదీన తాను విజిట్ చేస్తానని, అప్పటివరకు ఏర్పాట్లు పూర్తి కావాలి….దర్గా లో తొలగించిన సేవ చేసే ఇద్దరు వ్యక్తులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ కు జగ్గారెడ్డి సూచించిచేరు.ఫతే ఖాన్ దర్గా కు పర్మినెంట్ సౌకర్యాలు ఎం కావాలో ఒక డిజైన్ తయారు చేయండని అధికారులు, దర్గా కమిటీ కి జగ్గారెడ్డి సూచించిచారు.సంగారెడ్డి కి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు వినతి పత్రం ఇచ్చి , అప్పుడే నిధులు విడుదల చేయిస్తానని తెలిపిన జగ్గారెడ్డి… ఫతే ఖాన్ దర్గా తో పాటు సిఎస్ఐ చర్చ్, వైకుంఠ పురం, మహేశ్వర శర్మ జ్యోతిర్వాస్తు విద్యా పీఠం కు సైతం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భం లో నిధులు ఇప్పిస్తానని తెలిపారు.సంగారెడ్డి ఫతే ఖాన్ దర్గా, సదాశివ పేట మహబూబ్ భాష దర్గా కమిటీ లు త్వరలో నియమించుమని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి, వక్ఫ్ బోర్డు చైర్మెన్ అజ్మతుల్లా కు చెప్పానని, త్వరలో నియామకాలు పూర్తవుతాయని జగ్గారెడ్డి స్పష్టం చేసారు.















