EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆధ్యాత్మికత ఆత్మ-పరమాత్మల అనుసంధాత”            డాక్టర్ కె.వి. రమణాచారి

ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 24

మానవ జీవితం ఆధ్యాత్మికతో ముడిపడి ఉన్న మహోన్నత స్థితి అని, దానికి పలు రచనలు, శ్లోకాలు ధన్యతను చేకూర్చుతాయని డాక్టర్ కె.వి. రమణాచారి అన్నారు.శ్రీ మానస ఆర్ట్స్ ధియేటర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయితలు డా॥ వేదాన్తం ఆంజనేయ కుమారస్వామి, బండారుపల్లి రామంద్రరావులు శ్రీ వెంకటేశ స్తోత్రములకు తెలుగు భావార్ధముల సంకలన గ్రంథాన్ని, ప్రముఖ కవి రఘుశ్రీ రచించిన “రఘుశ్రీ హైకూలు” పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ పూర్వసలహాదారులు డా. కె.వి.రమణ చారి ఆవిష్కరించి, ప్రసంగించారు. మాసబ్యాంక్లో ని డా.రమణాచారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గాయకులు కడియాల ప్రభాకరరావు అధ్యక్షత వహించారు.డాక్టర్ కె.వి. రమణాచారి ప్రసంగిస్తూ శ్రీ వెంకటేశ్వరస్వామి పద్దెనిమిది శ్లోకాలను ఎంచుకుని తెలుగు భావార్థ రచన గావించిన కుమారస్వామి, సంకలనకర్త బండారుపల్లి రామచంద్రరావుల కృషి ప్రశంసనీయమని ద్వైతాద్వైతములు, కర్మ యోగములు, భక్తియోగ జ్ఞానయోగ, రాజయోగ, బుద్ధి యోగముల విశ్లేషణ విశేషముగా ఉన్నావని, ఇటువంటి రచనలు మనస్సును ఉద్దీపింపజేసి అలౌకిక తత్వాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని కలుగ జేస్తాయని అన్నారు. ఇది నేటి యువతకు అవసరమైన గ్రంథమని అన్నారు. రఘుశ్రీ హైకూలులో సామాజిక స్పృహ, హాస్యం, వ్యంగ్యం, ఇమిడి ఉన్నాయని కొనియాడారు.అనంతరం గ్రంథకర్తలను ఘనంగా సత్కరించారు.ఇంకా సభలో పద్యకవి కళ్యాణశ్రీ మరియు గ్రంథకర్తలు ప్రసంగించారు.ఈ సందర్భంగా డా. రమణాచారి దంపతులను గ్రంథకర్తలు, మానస సంస్థ పక్షాన ప్రత్యేకించి సత్కరించారు.ఇదే సభలో డా. కె. సాంబమూర్తి, డా.నర్మదారెడ్డి, టి.వి. స్వామి, చీకోలు సుందరయ్య, పరిమి సత్యమూర్తి, డా. పరిమి సీతాలక్ష్మి, శ్రీమతి అపర్ణ, శ్రీమతి విజయభారతి తదితరులు ఆత్మీయ సత్కారాలు అందుకున్నారు.భా కార్యక్రమానికి ముందు జరిగిన కవి సమ్మేళనానికి విజయభారతి అధ్యక్షత వహించారు.

Related News

Select the Topic
Scroll to Top