ఈతరం భారతం డిసెంబర్ 25 హైదరాబాద్:
కొత్త సర్పంచులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో సంబంధం లేకుండా.. తాను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి ద్వారా చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఇవి నేరగా సీఎం ఖాతా నుంచే గ్రామ అకౌంట్లకు బదిలీ అవుతాయని చెప్పారు. వెంటనే, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.















