EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బీసీ లను దగా చేసిన బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలి

తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ల హక్కులను కాలరాసి దగా చేసిన దగుల్బాజీ పార్టీ బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలని తెలంగాణ రాష్ట్ర తొలగించబడిన 26 కులాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. అన్ని రకాలుగా తెలంగాణ ప్రజానీకాన్నిమోసం చేసిన సీఎం కెసిఆర్, బిఆర్ఎస్ ను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ది చెప్పాలని అయన కోరారు. హైదరాబాద్, బషీర్ బాగ్, దేశోద్ధారక భవన్ లో సోమవారం తెలంగాణ రాష్ట్ర తొలగించబడిన 26 కులాల పోరాట సమితి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సమితి నేతలతో కలసి ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ సీఎం కెసిఆర్ తన కొడుకు, కూతురు, అల్లుళ్లను బతికించడానికి దుర్మార్గమైన అవినీతి పాలనా కొనసాగిస్తూ 50 శాతం జనాభా ఉన్న బీసీలను రాజకీయంగా, విద్య, ఉపాధి, ఉద్యోగ, సామాజికపరంగా అణిచివేశాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. నిజాం పాలనా నుండి కొన్ని దశాబ్దాలుగా తెలంగాణాలో కొన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన అణుగారిన బీసీ కులాలు తమ జీవనం కొనసాగిస్తున్నాయని, ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తరతరాలుగా తెలంగాణాలో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన అత్యంత వెనుకబడిన 26 బీసీ కులాలను సీఎం కెసిఆర్ వివక్షాపూరితంగా తెలంగాణ బీసీ కుల జాబితా నుండి తొలగించి అన్యాయం చేసాడని అయన ఆరోపించారు. తొలగించిన 26 బీసీ కులాల ప్రజలు గత 10 సంవత్సరాల నుండి విద్య, ఉపాధి, ఉద్యోగ పరంగా తీవ్రంగా నష్ట పోయారని అయన తెలిపారు. బడుగు బలహీనవర్గాలైన బీసీ లను ఓసీలుగా మర్చి వారి రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం కెసిఆర్ ప్రభుత్వం చేస్తుందని అయన దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో తొలగించిన 26 బీసీ కులాల గణనీయమైన మరియు కేంద్రీకృత జనాభా ఉందని, 33 జిల్లాలలో గెలుపు ఓటమిలు ప్రభావితం చేసే సత్తా తొలగించిన 26 బీసీ కులాలకు ఉందని తెలిపారు. బీసీ జాబితా నుండి 26 బీసీ కులాలను తొలగించి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన బిఆర్ఎస్ ను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తీరుతామని పేర్కొన్నారు. బీసీల జాబితా నుండి తొలగించిన 26 కులాలను రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి చేర్చుతామని హమీ ఇచ్చి తమ మానిఫెస్టోలో చేర్చితే ఆ పార్టీలకు ఓటు వేసి గెలిపిస్తామన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ జాబితా నుండి తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేర్చుతామని ఇప్పటికే పలుమార్లు పలువురు కాంగ్రెస్ నేతలు ప్రకటించారని, అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ వెంటనే తొలగించిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చి, బీసీ డిక్లరేషన్ ని అమలు చేయాలనీ అయన విజ్ఞప్తి చేసారు. రాష్ట్రంలో 50 శాతం ఉన్న బీసీలను ముఖ్యమంత్రి కెసిఆర్ తన మాయమాటలు, మోసపూరిత హామీలతో ప్రసన్నం చేసుకునేందుకు కుట్రలు పన్నుతూ మూడవసారి అధికార పీఠం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఈ సారి మళ్ళి బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీ ల హక్కులు ఫుర్తిగా కాలరాయబడుతాయని రాష్ట్రంలోని బీసీలందరు గమనించాలని అన్నారు. గత పది సంవత్సరాలలో దుర్మార్గపు పాలనా కొనసాగించి, బీసీల సంక్షేమాన్ని విస్మరించి, తీవ్ర అన్యాయానికి గురి చేసిన బిఆర్ఎస్ ను ,రాష్ట్రంలోని బీసీ లంతా ఒక్కటై అసెంబ్లీ ఎన్నికల్లో అంతమొందించాలని ,జనాభా లెక్కల్లో కులగణన చేయడానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ని ప్రతి నియోజక వర్గం లో గెలిపిస్తామని ఆళ్ల రామకృష్ణ కాంగ్రేసు పార్టీ కి హామీఇచ్చారు .

 

Related News

Select the Topic
Scroll to Top