ఈతరం భారతం డిసెంబర్ 29 హైదరాబాద్
వైకుంఠ ఏకాదశి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తిరుమలకు వెళ్తున్నారు. రేపు ఆయన తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ పర్వదినం సందర్భంగా భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈ అర్ధరాత్రి నుంచే ద్వారాలు తెరుచుకోనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది.















