ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 29
ఆర్య వైశ్య కార్పొరేషన్ పదవి తీసుకొని ఆర్యవైశ్యులకు ఓరుగ బెట్టినది ఏమీలేదని ఆర్య వైశ్యు కార్పొరేషన్ చర్మెన్ కాలువ సుజాత పై టిఆర్ఎస్ మహిళలు నిప్పులు చెరిగారు. సోమవారం ఎక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో వారు మాట్లాడుతూ ఆమె కాలువ సుజాత కాదు మురికి కాలువ సుజాతమ్మ అని ఎద్దేవా చేసారు.స్థాయికి మించి మాట్లాడే ముందు తెలుసు కోవాలని హితవు పలికారు. తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కె.సి.ఆర్ ఉప్పల్ భగత్, హైదరాబాద్ లో కోట్ల రూపాయల విలువ గల 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆర్యవైశ్య మహాసభ కమిటీ వారికి కేటాయించిన సంగతి నీకు తెలుసా ? తెలిసుంటే నువ్వు ఓరుగ బెడుతున్నది ఏమిటి? ఆర్యవైశ్య కార్పొరేషన్ నుండి నిధులు విడుదల చేసి కుల సోదరులకు మంచి చేసే బుద్ధి, జ్ఞానం మాత్రం నీకు లేదు. కనీసం రెండు సంవత్సరాల నుండి నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు మీరు, మీ ప్రభుత్వం ఏమి చేసినారో కాస్త ఆలోచించు మురికి కాలువ సుజాత అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికలకు 2014, 2018, 2023 లో మీ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా ఆర్య వైశ్యులకు కేటాయించలేదన్న సత్యం తెలుసుకో మురికి కాలువ సుజాత, అందుకు ప్రతీకారంగా మీ కాంగ్రెస్ నాయకులను మీ చెప్పుతో కొట్టుకో లేదంటే నీ చెప్పుతో నువ్వే కొట్టుకొని ప్రాయక్షిత్యం చేసుకో మురికి కాలువ సుజాత. పేరుకు పెద్ద ఉరికి దిబ్బ మాదిరి ఆర్య వైశ్యు కార్పొరేషన్ పదవి నువ్వు తీసుకొని ఓరుగ బెట్టినది ఏమీలేదని, పదవి కాలం తొందరలో ముగుస్తుంది కావున మళ్ళీ ఇంకొక్క సారి పదవి కాలం పొడిగించు కోవాలని డ్రామాలు చేస్తున్నవని విమర్శించారు. ఈసమావేశం లో బి ఆర్ ఎస్ మహిళా నాయకురాళ్ళు రూపారెడ్డి, బిందూ, దేవిప్రియ, అనుషా, అంజలి, రేఖ, పద్మారెడ్డి, సత్యవేణి సత్యదేవి తది తరులు పాల్గొన్నారు.















