EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఉత్తర ద్వార దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ రంగనాయక స్వామి

ఈతరం భారతం డిసెంబర్ 30 యాదాద్రి భువనగిరి :

జిల్లా పరిధి లోని ఆలేరు నియోజకవర్గ కేంద్రం ఉన్న అపర వైకుంఠంగా ప్రసిద్ధి పొందిన శ్రీ గోదా లక్ష్మీ సమేత శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం ఐదు గంటలకు ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. మహిళలు మంగళ హారతులతో హాజరయ్యారు. ఉత్తర ద్వారం నుండి శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ రంగనాయక స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు . శ్రీ రంగనామస్మరణ మధ్య ఆలయం ప్రతిధ్వనించింది. ఆలయ అర్చకులు మంగళగిరి శేషగిరి, వరదరాజు ఆధ్వర్యంలో ధనుర్మాస పాశురాల పఠనం మధ్య ఉత్సవమూర్తులకు విశేష పూజలను నిర్వహించారు. మున్సిపల్ కమీషనర్ బి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, ఆలయ చైర్మన్ గోపిరెడ్డి, కమిటీ ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, మహిళలు, భక్తులు హాజరయ్యారు.

Related News

Select the Topic
Scroll to Top