EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజకీయ కార్యదర్శి గా బయ్యా వెంకటేశ్వర్లు యాదవ్

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 1

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజకీయ కార్యదర్శి గా బయ్యా వెంకటేశ్వర్లు యాదవ్ నియమితులైనారు .ఈ మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాజకీయ కార్యదర్శి గా నియమిఇస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం,కుషాగూడ డివిజన్ కు చెందిన బయ్య వెంకటేశ్వర్లు యాదవ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటులో హితోదిక కృషి చేసారు. ఈ సందర్బంగా బయ్య వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… నాకు అప్పగించిన ఈ బాధ్యత పట్ల పూర్తి నిబద్ధత నిజాయితీగా పని చేస్తానని నాతోటి రాష్ట్ర కమిటీ మిత్రులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటు,పార్టీనీ, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. అలాగే భయ్యా వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్యాలెండర్ మరియు పార్టీ సంబంధించిన స్టిక్కర్స్ ఆవిష్కరణ పార్టీ అధినేత ఎమ్మెల్సీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈసందర్బంగా పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య , రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలబోయన ఓదేలు యాదవ్ , రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ , రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్ల వాసుదేవ్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top