EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

2026 నూతన సంవత్సరానికి ముగ్గులతో బాలికల స్వాగతం

ఈతరం భారతం యాదాద్రి భువనగిరి జనవరి 1

జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని ఆదర్శనగర్, పోచమ్మవాడ, బృందావన్, సిల్క్ నగర్, మైత్రి కాలనీ, శాంతినగర్, క్రాంతి నగర్, భారత్ నగర్, సంతోషిమాతనగర్, రాంశివాజీ నగర్ లలో చిన్నారులైన బాలికలు గురువారం ప్రత్యేకంగా రంగులతో వేసిన ముగ్గులతో వినూత్న రీతిలో 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. పచ్చని చెట్లు, పద్మపురాశులు, పుష్ప తోరణాలతో సంప్రదాయాన్ని, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలియ చెబుతూ నూతన సంవత్సర ఆరంభ వేళ బాలికలు వేసిన ముగ్గులను పలువురు చూసి వారి సృజనాత్మక శక్తిని కొనియాడుతూ ప్రశంసించారు.

Related News

Select the Topic
Scroll to Top