EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ డిజిపి ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 2

మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోవడం గత కొంతకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం చేపట్టిన ఆపరేషన్లలో పలువు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం.. మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరుగుతోంది. తాజాగా మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా తెలంగాణ డిజిపి ఎదుట లొంగిపోయారు. మరో 15 మంది మావోయిస్టులతో కలిసి బర్సే దేవా లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిజరేషన్ ఆర్మీ చీఫ్‌గా బర్సే బాధ్యతలు నిర్వర్తించారు. హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత పార్టీలో బర్సే కీలకంగా ఉన్నారు. మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహరాలను చూస్తున్నారు. కాగా, హిడ్మా, బర్సే దేవా ఛత్తీస్‌గఢ్‌లో ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మావోయిస్టులకు ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్ర పోషించారు. ఎన్ని తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు నుంచి బర్సే దేవా బృందాన్ని పోలీసులు తీసుకువచ్చారు. బర్సే లొంగుబాటు వివరాలను డిజిపి శివధర్ రెడ్డి శనివారం మీడియాకు వెల్లడించనున్నారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top