EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అన్వేష్ మీద దేశం ద్రోహం కేసు నమోదు చేయాలి: రాజు నేత

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 3

హిందూ దేవి దేవతలను కించపరిచేలా హిందూ దేవాలయాలను కూలగొట్టాలని హిందూ మతాన్ని నాశనం చేయాలని మాట్లాడిన యూట్యూబర్ నా అన్వేషణ అవినాష్ పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని , కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో తెలంగాణ ఉద్యమకారుడు బిజెపి రాష్ట్ర నాయకులు రాజు నేత పిర్యాదు చేసారు. అనంతరం రాజు నేత మాట్లాడుతూ ఇలాంటి దేశ ద్రోహులు 100 కోట్ల మందికి పైగా ఉన్న హిందువుల మనోభావాలను కించపరిచేలా, రెచ్చగొట్టేలా హిందువులంతా దొంగలని హిందువులు రేపిస్టులని మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నాడని… విదేశాలలో ఉంటూ మన దేశ గడ్డ మీద పుట్టి పెరిగి మన దేశపు సొమ్ము తింటూ అబద్దాలను ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కచ్చితంగా తగిన రీతిలో సమాధానం ఉంటుందని అన్నారు.ఫిర్యాదు చేసిన వారిలో బిజెపి ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనుగంటి రాజు నేత, హైకోర్టు అడ్వకేట్ రాము, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ, బొమ్మరాసపల్లి సర్పంచ్ చెరుకు తిరుపతమ్మ, వెంకటయ్య, జగన్ చారి తదితరులు ఉన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top