EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబిసి మహిళలకు అవకాశం కల్పించాలి

33 శతం మహిళా రిజర్వేషన్ బిల్లులో ఒబిసి మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి అలా కల్పించినప్పుడే ఒబిసి వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్ రావు అన్నారు. అలాకాని పక్షంలో అగ్రకుల మహిళా రాజకీయ న్యాయకత్వం కోసమే కానీ అన్నీ వర్గాల మహిళల న్యాయకత్వం కోసం కాదన్నారు. సోమవారం విజయవాడ ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున మహిళలు దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేసన శంకర్ రావు ముఖ్య అతిధి గా విచ్చేసి ప్రసంగించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ సంపత్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు వావిలాల సరళ దేవి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకారావు గారు, మేక వెంకటేశ్వర్లు గారు , స్వాతి గారు, హనుమంతు గారు, ద్వారక శ్రీనివాస్ గారు దగ్గర నాయకులు పాల్గొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top