EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కరెన్సీ పై గాంధీ బొమ్మ ను తొలగించే కుట్రలను తిప్పి కొట్టాలి

ఈతరం భారతం సంగారెడ్డి జనవరి 5

నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి లో మూడు రోజుల పాటు జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా ఆదివాసి కార్యకర్తల, నాయకుల శిక్షణ శిబిరం సోమవారం తో ముగిసింది. ఈ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సురేష్ శెట్కార్, TGIIC చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్, నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణా శిబిరం లో పాల్గొన్న కార్యకర్తలకు ముఖ్య అధితుల చేతుల మీదుగా వారికి ప్రశాంస పత్రాలు అందజేశారు. ఆదివాసీల హక్కులు, సంక్షేమ పథకాలపై అవగాహన ప్రధాన ఎజెండా గా జరిగిన ఈ శిక్షణా కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమం లో ప్రతీ ఒక్కరూ సిన్సియర్ గా చాలా ఇష్టంగా పాల్గొన్నారన్నారు.ఇలాంటి క్యాంపు సంగారెడ్డి లో జరగడం సంతోషంగా ఉందని తెలిపారు.రాయణఖేడ్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ అవకాశం కలిపిస్తామని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటి దన్నారు. దేశ స్వాతత్ర్యం కోసం పోరాటం చేయని వారు గాంధీ బొమ్మ ను తొలిగించాలని కుట్ర చేస్తున్నారని అందరం ఏకం అయ్యి అలాంటి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ఇతర పార్టీలు మాటలతో సరిపెట్టుకుంటారు. ..కానీ కాంగ్రెస్ పార్టీ ఆలా కాదు… ఇచ్చిన మాటను నిలబెట్టుకొని తీరుతుంద ని వివరించారు. అదివాసీ శిక్షణలో జరిగిన చర్చలు, విషయాలను బయట చెర్చించా లని కోరారు. అనంతరం ఎంపీ సురేష్ శెట్కార్ మాట్లాడుతూ ఉపాధి హామీ పధకం నుండి గాంధీ పేరు ను తీసేసి కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. కేంద్రం చర్యలకు వ్యతిరేకం గా పార్లమెంట్ లో పోరాటం చేస్తామన్నారు.గరిబోళ్ల కు ఉపాధి కల్పించకుండా, గరిబోళ్లను పెంచే విదంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు..

Related News

Select the Topic
Scroll to Top