EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జీహెచ్ఎంసీ వార్డుల విస్తరణ పై సమీక్ష సమావేశం

ఈతరం భారతం హైద్రాబాద్ జనవరి 6

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలోని ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ వార్డుల విస్తరణ అంశం పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, అభ్యంతరాలపై.. అలాగే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యాచరణపై ఎన్. రాంచందర్ రావు నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ , పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్.గౌతమ్ రావు , పార్టీ సీనియర్ నాయకులు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ సహా పార్టీకి చెందిన ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top