EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కిక్కిరిసిన తెలంగాణ జాగృతి కార్యాలయం..  కవితకు మద్దతుగా తరలివచ్చిన జనం

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 6

తెలంగాణ జాగృతి’ రాజకీయ శక్తిగా అవతరించబోతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల బాధ్యులు, కార్యకర్తలు బంజారాహిల్స్‌ లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి కవితకు సంఘీభావం తెలుపుతూ మద్దతును ప్రకటించారు. అయితే, తనను కలిసేందుకు వచ్చిన జనసందోహానికి కవిత ఆమె ఇంటి బాల్కనీలో నిలబడి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.అనంతరం కిందకు వెళ్లి ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను కవిత అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలం నుండి తన వెన్నంటి ఉండి, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ మద్దతుగా నిలిచిన ఉద్యమకారులను చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో జాగృతి కార్యాలయం పరిసర ప్రాంతాలు ‘జై తెలంగాణ’, ‘కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి’ అనే నినాదాలతో మారుమోగాయి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కవిత గారికి అండగా ఉంటామని వివిధ సంఘాల నేతలు కవిత సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు.

Related News

Select the Topic
Scroll to Top