EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్: ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్

ఈతరం భారతం జనవరి 6 ఖమ్మం/రఘునాథపాలెం:

ఈరోజు మధ్యాహ్నం సమయంలో రఘునాథపాలెం పోలీసుల ఆధ్వర్యంలో కోయచిలక క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఆటో లో వస్తున్న వారు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా ఆటోను వెంబడించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోని విచారించగా మూడు రోజుల క్రితం 02.01.2026న రేగులచిలక గ్రామ పరిధిలో తెల్లబోయిన రాంబాబు ఇంటిలో మధ్యాహ్నం సమయంలో ముందస్తు పదకం ప్రకారం ముదిగొండ మండలం, ముత్తారం గ్రామానికిన్ చెందిన లంజపల్లి శేకర్ @ టోనీ, రేగులచేలక గ్రామానికి చెందిన జంగా వెంకన్న మరియు కోయచేలక గ్రామానికి చెందిన కొరకోప్పుల నవీన్ అనుముగ్గురు వ్యక్తులు రాంబాబు ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి ఇంటిలోకి వెళ్లి బీరువా పగలగొట్టి అందులోని రూ.7,30,740/- లక్షల విలువ గల 114 గ్రాముల బరువు గల బంగారపు వస్తువులు దొంగిలించగా , వారి వద్ద నుండి ఈ రోజు 7,30,740 లక్షల విలువగల బంగారు నగలు, ఒక ఆటో ని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు.

నిందితుల వివరాలు :

A1. లంజపల్లి శేకర్ @టోనీ S/O నాగేశ్వరరావు, వయసు: 30 సం,,రాలు, వృత్తి: ఆటో డ్రైవర్ R/o ముత్తారం గ్రామం, ముదిగొండ మండలం. ( గతం లో ఇతని పై వైరా, ఖమ్మం రూరల్,జగ్గయ్యపేట లలో దొంగతనం మరియు చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి.)

A2. జంగా వెంకన్న S/o వీరయ్య, వయ్యస్సు: 37 సం, నివాసం: రేగులచేలక గ్రామం, రఘునాధపాలెం మండలం.

A3. కొరకోప్పుల నవీన్

ఇట్టి కేసుని ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన రఘునాథపాలెం Ci. MD.ఉస్మాన్ షరీఫ్ ని, SI లు G.నరేష్ , M. తేజేశ్వర్ రెడ్డి , సిబ్బంది S.రవి కుమార్(HC-344), K. సంజీవ్ కుమార్(HC-1254), శ్రీనివాసులు(PC-1029), పోలీస్ స్టేషన్ సిబ్బందిని CP సునీల్ దత్తు , S.V.రమణమూర్తి ACP ఖమ్మం టౌన్ అభినందించారు.

Related News

Select the Topic
Scroll to Top