ఈతరం భారతం రంగారెడ్డి జనవరి 7
ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రియుడు తట్టుకోలేక పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోయాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన పూజ(17), మహేశ్(20) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి తల్లికి తెలియడంతో కూతురుతో పాటు మహేశ్ మందలించింది. తల్లి చెప్పిన విధంగా కూతురు నడుచుకుంటుంది. అమ్మాయి తాతకు మహేష్ ఫోన్ చేయడంతో ఆమె లిఫ్ట్ చేసింది. తనని ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని లేకపోతే చనిపోతాయనని యువతిని బెదిరించాడు. ఈ విషయం పూజ తన తల్లి అలివేలుకు చెప్పడంతో మంగళవారం ఉదయం లేచేసరికి యువతి దూలానికి ఉరేసుకుంది. మహేశ్ వేధించడంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో మహేష్‌కు తెలియడంతో మానసికవేదనకు గురయ్యాడు. బుధవారం ఉదయం బ్రహ్మణపల్లి శివారులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల క్రితం మహేష్, పూజ ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం
.















