ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 7
ఏబివిపి సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ప్రెసిడెంట్ గా అభినయ్ యాదవ్ నియమితులైనారు. పీజీ కళాశాల నూతన కమిటీని హైదరాబాద్ మహానగర వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేందర్ రెడ్డి ప్రకటించారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏబివిపి జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్ మాట్లాడుతూ బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించి మనదేశంలోని నలంద తక్షశిలా వంటి విశ్వవిద్యాలయాలను, అక్కడున్న గ్రంథాలను తగలబెట్టేసి దేశం నుండి బంగారం ఖనిజాలు మరియు అనేకమైనటువంటి వాటిని దోచుకు వెళ్లారు కానీ మన మేదస్సును మాత్రం దోచుకొలేకపోయారు మరియు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, విద్యార్థుల కోసం విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరంగా సమాజంలో ఉంటూ నైతిక విలువలు కలిగిన సమాజాన్ని నిర్మించాలని ఆలోచనతో ఉన్నతమైన విద్యార్థులను తయారు చేయడం లక్ష్యంగా సమాజంలో పనిచేస్తుందన్నారు.అనంతరం హైదరాబాద్ మహానగర వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసి ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్ లో ఉన్నటువంటి విద్యార్థి సమస్యలు కళాశాల సమస్యలపై దృష్టిసారించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ నైతిక విలువలు కలిగిన సమాజంలో మీ వంతు పాత్ర పోషించాలని కోరుకున్నారు.మారేడు పల్లి టౌన్ ప్రెసిడెంట్ డా:మల్లారెడ్డి డా:రవి , సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క. బాలకృష్ణ, హైదరాబాద్ మహానగర ఎస్ఎఫ్డి కన్వీనర్ పాండు రంగ్ గారు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లావణ్య,శ్రీరామ్,బేగంపేట్ టౌన్ సెక్రటరీ పవన్,మారేడు పల్లి టౌన్ సెక్రటరీ కృష్ణ,డి.విజయ్ కుమార్, విక్రమ్,విజయ్, గణేష్, రవి, శ్రీకాంత్, దుర్గేష్, మనోజ్,రామ్, శ్రీకర్, అజయ్, భాను, పృథ్వి, రమన్, అబ్బు ఫారహన్, చెన్నాయా, రవి,అమర్నాధ్, సాయి కుమార్,జ్యోతి రాజ్, మణిదీప్, కావ్య, జాన్సీ, పరశురామ్, రాఘవేంద్ర, అంజలి, నింకాంత్,ఐశ్వర్య, కీర్తన, నవ్య శ్రీ, నవ్య, మాధవి, నీతిష, శివ ప్రియా, ప్రణీత్, మరియు కార్యకర్తలు, విద్యార్థి నాయకులు,తదితర విద్యార్థులు పాల్గొన్నారు…















